తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను 188 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత, డిసెంబర్ 22న
ప్రారంభమయ్యే రెండో టెస్టుకు శాశ్వత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా?
లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన
రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎడమ బొటన వేలికి గాయం కావడంతో రోహిత్
ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అతని స్థానంలో బెంగాల్ ఓపెనర్
అభిమన్యు ఈశ్వరన్ తొలి టెస్టుకు భారత జట్టులో స్టాండ్-ఇన్‌గా ఎంపికయ్యాడు.
కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘన
విజయం సాధించింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటిన టీమిండియా..
ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. బంగ్లా బ్యాటర్లు నాలుగో రోజు కాసేపు
పోరాడినప్పటికీ.. భారత బౌలర్లకు తలవంచక తప్పలేదు. ఇక చివరి రోజు 50
నిమిషాల్లోనే 4 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు టెస్టు మ్యాచ్‌లో ఓటమి చవి
చూసింది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం.
ఇదిలా ఉండగా, రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడనీ సమాచారం. “రోహిత్
గురించి నాకు తెలియనప్పటికీ మరుసటి లేదా రెండు రోజుల్లో (అతని పరిస్థితి)
తెలుసుకోవచ్చు.” అని రాహుల్ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు
విజయం సాధించిన తర్వాత జట్టు ఆల్‌రౌండ్‌తో కూడిన కృషిని, సమన్వయాన్ని రాహుల్
ప్రశంసించాడు.