125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ జీర్ణించుకోలేకపోతున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి విమర్శలు
చేస్తున్నారు
తెలంగాణ సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు
చేస్తున్నారా..?
పేపర్ లికేజి ఘటనలో పట్టపగలు పట్టుబడిన దొంగ బండి సంజయ్
బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్
దళితుల జనొద్ధారణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి
కేసీఆర్ ని విమర్శించే నైతిక అర్హత బండి సంజయ్ కు లేదు : కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి,
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. దేశంలోనే అత్యంత
ఎత్తులో 125 అడుగుల భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం
అవిష్కరించుకున్న సందర్భంగా బండి సంజయ్ చేసిన విమర్శలు అర్ధరహితమన్నారు. బండి
సంజయ్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ
జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా
ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. పేపర్ లికేజి
ఘటనలో పట్టపగలు పట్టు బడిన దొంగ బండి సంజయ్ కు . దళితుల జనొద్ధారణ కోసం అనేక
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే నైతిక అర్హత
లేదన్నారు. తెలంగాణ సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు
చేస్తున్నారా లేక.. నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని
డిమాండ్ చేస్తున్నందుకు విమర్శిస్తున్నారా సమాధానం చెప్పాలన్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ పై తెలంగాణ సర్కార్ పై చేసిన విమర్శలకు బండి సంజయ్
క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని
మాట్లాడాలన్నారు. లేనట్లయితే ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని మంత్రి
కొప్పుల హెచ్చరించారు.