హైదరాబాద్: వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది. గ్యాస్
ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి
ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50
బాదేశారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. మంగళవారం వరకు గృహ
వినియోగ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,105 ఉండగా తాజా పెంపుతో అది
రూ.1,155 అయింది. వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.2119.50కు ఎగబాకింది.
ఇప్పటికే నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి
విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది.