ప్రస్తుతం చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి
ప్రయత్నిస్తున్నారు. దీనికోసం రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు.
దీనివల్ల చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు సమాచారం.
ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం, మంచి డైట్ ప్లాన్ ను అనుసరించడం, వ్యాయామాలు
చేయడం ద్వారా బరువు తగ్గడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయం పొట్టలో సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి
తీవ్ర సమస్యలకు గురి కావడానికి.. ప్రధాన కారణం కేవలం బరువు పెరగడమే.. అయితే ఈ
పెరుగుతున్న బరువును హెల్తీగా తగ్గించుకోవడానికి చాలా తక్కువ పరిమాణంలో ఆహారం
తీసుకోవాలి. దీని వల్ల అధిక శరీర బరువును నివారించవచ్చని పలు అధ్యయనాలు
వెల్లడిస్తున్నాయి. కొందరు వ్యక్తులు తమ ఆహారాన్ని రోజులోని నిర్దిష్ట సమయాలకు
పరిమితం చేయకుండా వారి బరువు తగ్గించే లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు
సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువ సంఖ్యలో అధిక, మధ్యస్థ పరిమాణంలో ఆహారం
తీసుకునే వ్యక్తులు బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోజూ
తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా
ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ, కొందరు వ్యక్తులు తమ ఆహారాన్ని రోజులోని
నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయకుండా వారి బరువు తగ్గించే లక్ష్యాలను
సాధించవచ్చని ఇటీవలి అధ్యయనం సూచిస్తుంది. బరువు తగ్గడం కోసం అడపాదడపా ఉపవాసం
చేయడం కంటే కేలరీల పరిమితి పాటించడం మరింత విజయవంతమైంది. ఆరు సంవత్సరాల
అధ్యయనంలో, రోజులో ఎక్కువ సంఖ్యలో పెద్ద లేదా మధ్యస్థ భోజనం తినే వ్యక్తులు
బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి విరుద్ధంగా, తక్కువ
భోజనం తినే వారు ఈ సమయంలో బరువు తగ్గే అవకాశం ఉంది. అయితే రోజులోని మొదటి
భోజనం, చివరి భోజనం మధ్య సమయ విరామం ప్రజల బరువుపై ప్రభావం చూపలేదు.