బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
బర్డ్ ఫ్లూ వ్యాధి సోకితే మానవ జాతి వూపిరి తిత్తుల మీద శ్వాసకోశ వ్యవస్థ మీద ప్రభావం చూపి ప్రాణాలు పోయోప్రమాధం ఉంది.దింతో బర్డ్ ఫ్లు వైరస్ తో బాలాయపల్లి మండల ప్రజలు భయం.. భయంగా జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలోని ఈవ్యా ధి ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.నెల్లూరు జిల్లా కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా వుండాలి అని ఆదేశాఖలు జారిచేసి గ్రామాల్లో అవగాహన కల్పించి దండోరాలు వేస్తున్నారు. వ్యాధి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లోని చాట్లగుట్ట,కోవూరు మండలం లోని గుమ్మళ్ళ దిబ్బ ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి తో కోళ్లు చనిపో యాయి,ఈవిషయం అందరికి తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ కోళ్లు మృతి దేశాలు పాడేస్తున్నారు.
ఇంత వరకు తిరుపతి జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భయాందోళ నలకు గురవుతున్నారు.ఇక చికెన్ షాప్ యాజమానుల్లో చైతన్యం తేవాలి గ్రామాల పరిధిలో సానిటైజేషన్ చేయాలి అని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించాలని కోరుతున్నారు..
పోటో:-వెంకటరెడ్డిపల్లి సమీపంలో పారేసిన కోళ్ళు వ్యార్థలు
పోటో:-బాలాయపల్లిలో పారేసీన మృతి చెందిన కోళ్ళు