అనేక రైళ్లు రద్దు
బిపోర్జాయ్ తుపాను బలహీనపడిందని ఐఎండీ వెల్లడించింది. ఇది అతి తీవ్ర తుపాను
నుంచి తీవ్ర తుపానుగా మారిందని తెలిపింది. 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
వీస్తూ.. జూన్ 15న ఇది కచ్ తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది. దీంతో
అధికారులు అప్రమత్తమయ్యారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను
బలహీనపడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అతి తీవ్ర తుపాను నుంచి
తీవ్ర తుపానుగా బిపోర్జాయ్ మారిందని తెలిపింది. ప్రస్తుతం పోరుబందర్‌కు
నైరుతి దిశలో 290 కిలోమీటర్ల దూరంలో జఖౌ పోర్ట్‌కు దక్షిణ-ఈశాన్యంగా 360
కిలోమీటర్ల దూరంలో బిపోర్జాయ్ కేంద్రీకృతమైందని భారత వాతవరణ శాఖ
ప్రకటించింది. జూన్ 15న ఇది కచ్ తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది. ఆ
సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.
బిపోర్జాయ్ తీరంవైపు ముంచుకొస్తున్న నేపథ్యంలో మొత్తం రెండు దఫాలుగా తీర
ప్రాంత ప్రజల తరలింపు పక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సముద్రానికి
0-5 కిలోమీటర్ల దగ్గర్లో ఉన్న వారిని మొదటగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు
వారు వివరించారు. ఆ తరువాత 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉండే వారిని తరలించినట్లు
పేర్కొన్నారు. తరలింపు ప్రక్రియలో చిన్నపిల్లలకు, వృద్ధులకు, గర్భిణీలకు అధిక
ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 7500 మందికిపైగా
సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం 12
ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరో 15 బృందాలు
స్టాండ్బైలో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం, నౌకా,
కోస్టుగార్డు దళాలతో అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. భావ్‌నగర్, రాజ్‌కోట్,
అహ్మదాబాద్, గాంధీధామ్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లతో పాటు హెల్ప్‌లైన్
నంబర్లను కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలలో
భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం తీర
ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే స్వల్పంగా వర్షం కురిసింది.
బిపోర్జాయ్ ముంచుకొస్తున్న తరుణంలో కచ్ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు
అధికారులు. విద్యాసంస్థలకు జూన్ 15 వరకు సెలవులు ప్రకటించారు.