బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
బహుజన సమాజ పార్టీని గెలిపిస్తే బడుగులు సంక్షేమంగా ఉంటారని శుక్రవారం మండల కేం ద్రంలో బహుజన సమాజ పార్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు రోజు రోజుకి అవమానాలకు గురవు తున్నారని కొనియాడారు. నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వా ల వల్ల బడుగు బలహీన వర్గాల పై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని 2024లో జరుగుతున్న ఎన్నికల్లో బహుజన సమాజ పార్టీని గెలిపించాలని కోరారు.మనందరం సుఖసంతో షాలతో జీవిం చాలంటే బహుజన సమాజ పార్టీకి ఓటు వేయాల న్నారు.వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా పేరాల జయ చంద్ర ను గెలిపించాలని కోరారు. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మీ అంద రి సహకారాలతో బహుజన సమాజ పార్టీఅభ్య ర్థిగా గెలిపించా లన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజక వర్గ ఇన్చార్జి జోరేపల్లి వెంకటేశ్వర్లు (వెంకన్న). శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు, చిత్తూరు జిల్లా అభ్యర్థి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :-కరపత్రం విడుదల చేస్తున్న దృశ్యం