ఓదార్చి ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి
జోగి రమేష్
బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వేగంగా స్పందించిన మంత్రి
బాపట్ల : ఇటీవల బాపట్ల జిల్లా జంపని గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో
మృతిచెందిన కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు
ఐదుగురికి ఎక్స్ గ్రేషియా క్రింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 25
లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్ధిక సహాయం ముఖ్యమంత్రి ప్రభుత్వం
మంజూరు చేయగా, మంజూరైన చెక్కులను ఆదివారం మంత్రి స్వయంగా వారి ఇళ్ల వద్దకు
వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి, ధైర్యం చెప్పి అందజేశారు.
ఈనెల 5న సంఘటన జరిగిన వెంటనే మంత్రి వేగంగా స్పందించి మృతులను క్షతగాత్రులను
ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి మంత్రి
జరిగిన సంఘటన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. అంతే వేగంగా ముఖ్యమంత్రి
స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులు ఐదుగురికి ఒక్కొక్కరికి 5 లక్షల
చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయగా సంఘటన జరిగిన వారం లోగా ఆదివారం మంత్రి
వారి కుటుంబ సభ్యులకు చెక్కులను అంద చేశారు. ఈ కార్యక్రమంలో బందర్ ఆర్డీవో ఐ
కిషోర్, కృత్తివెన్ను ఎంపీపీ కునసాని గరుడ ప్రసాద్, జెడ్పిటిసి మైలా
రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్ కొల్లాటి గంగాధర్, సర్పంచ్ పాసం కృష్ణ, కాపు
కార్పొరేషన్ డైరెక్టర్ పిన్నింటి మహేష్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
డైరెక్టర్ భూపతి రాజు తాసిల్దారు రామకోటేశ్వరరావు పార్టీ కన్వీనర్ వెంకటరాజు,
తదితరులు పాల్గొన్నారు.