ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర
మోడీ తెలిపారు. రైలు ప్రమాద ఘటనాస్థలిని సందర్శించిన నరేంద్ర మోడీ ఆస్పత్రిలో
చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
రైలు ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలిపిన మోదీ.. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు
ఆదేశించామన్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ
శనివారం సందర్శించారు. అక్కడ పరిస్థితిని, సహాయక చర్యలను కేంద్ర మంత్రులు
అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి మోడీ ప్రత్యక్షంగా పరిశీలించారు.
రైలు ప్రమాద ఘటన గురించి అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.