గుంటూరు : బాబుకు పుత్రోత్సాహం లేదని, ఏ తండ్రయినా పుత్రోత్సాహానికి
ఉప్పొంగిపోతాడు…కానీ చంద్రబాబుకు మాత్రం పుత్రోత్సాహం స్థానంలో లోకేశ్ వంటి
తనయుడి వ్యవహారశైలి, అసమర్థత, అజ్ఞానం, బూతు పురాణంతో నిత్యం కుమిలి
కుమిలిపోతున్నాడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ అన్నారు. లోకేశ్
తీరు ఎంత ఛండాలంగా ఉందో అతని పాదయాత్ర నిరూపిస్తోందని, ఇతని బూతు మాటలు,
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడుతుంటే ఇతనొక
బూతేష్, ఒక బోకేష్..ఎందుకూ పనికిరాని పప్పు…తుప్పు..అని జనం పగలబడి
నవ్వుకుంటున్నారన్నారు. లోకేశ్ ఒక అజ్ఞాని. ఇతనికి చదువబ్బలేదు. రాజకీయాల్లో
పనికిమాలిన వాడిగా మిగిలిపోయాడు. నోరు విప్పితే సైకిల్ పోవాలని తాను నినాదాలు
చేస్తూ జనంతోనూ అవే నినాదాలు చేయిస్తూ టీడీపీ విధ్వంసానికి తానే భస్మాసురుడిలా
మారిన అర్భకుడు అని అన్నారు. ఆంధ్రాలో పాదయాత్రలు చేయాలని తండ్రి చెబితే
కర్ణాటకలో చేస్తాడు ఈ తెలివిలేని దద్దమ్మ అని విమర్శించారు.
బూతుల నాయుడు- బూతుల పార్టీ
ఇలాంటి అసమర్ధుడి పాదయాత్ర ఎంత హాస్యభరితంగా ఉందంటే ఇతను మాట్లాడే బూతులు,
భావప్రకటన, బాడీ లాంగ్వేజ్‌ను చూసి జనం ఇలాంటి చేతకాని దద్దమ్మ రాజకీయాల్లోకి
ఎలా వచ్చాడని నవ్విపోతున్నారు. సభికుల్లో ఒకరు తనను ఏదో అడిగితే దానికి ఇతని
సమాధానం చేతిని అసభ్యంగా ఊపుతూ కనిపించిన ఈ వీడియో దృశ్యమే నిదర్శమంటూ లోకేశ్
హావభావాలకు సంబంధించిన ఆ వీడియో క్లిప్పింగ్‌ను రాజీవ్ గాంధీ మీడియా ముందు
ప్రదర్శించారు. ఆ సభకు వచ్చిన మహిళలు, మీడియా ముందు ఇలా అసభ్యంగా
మాట్లాడడానికి, అసభ్యకరంగా చేతులు ఊపడానికి నీకు సిగ్గెలా లేకపోయింది లోకేశ్?
అని ప్రశ్నించారు. ఇలాంటి పప్పు చేసే ప్రసంగాల నుంచి జనం ఏం నేర్చుకోవాలి?
ఇంట్లో వాళ్ళే పట్టించుకోవడంలేదు
లోకేశ్ పాదయాత్ర అతని ఇంట్లో వారికే నచ్చలేదనడానికి ఉదాహరణ ఏంటంటే నువ్వు 200
కి.మీ. నడిచిన తర్వాత గాని నిన్ను చూడ్డానికి నీ భార్య బ్రాహ్మణి రాకపోవడమే
ఇందుకు నిదర్శనం. ఆ సాకుతో సాయంత్రానికి పాదయాత్ర వాయిదా వేశావు. కాస్త ఎండ
కాస్తేనే పాదయాత్ర చేయలేని నిన్ను ఐరన్‌లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని జనం
పిలుస్తున్నారు. నీభాషా జ్ఞానం చూస్తే నువ్వు పాదయాత్రకే అనర్హుడివి అని
అంటున్నారు.
పెట్టుబడులకు విశాఖ స్వర్గధామం
పెట్టుబడులు, పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రదేశమైనా, ప్రతిపక్షం లేనిపోని
దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రభుత్వం కృషి వల్ల అనేక పరిశ్రమలు విశాఖ
రాబోతున్నాయి. ఈ క్రమంలోనే మార్చిలో విశాఖలో పరిశ్రమల సదస్సును ముఖ్యమంత్రి
నిర్వహించబోతున్నారు. పెట్టుబడులకు విశాఖ స్వర్గధామం కాబోతోంది. వికేంద్రీకరణ
ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే జగన్ గారి లక్ష్యం. ఆ
లక్ష్యసాధనకు ఆయన అహర్నిశలూ కృషి చేస్తారని కొండా రాజీవ్ గాంధీ తెలిపారు.