అమరావతి : చంద్రబాబు-పవన్‌కల్యాణ్ భేటీ పెద్ద ఆశ్చర్యంగా లేదని ఆంధ్ర
ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో
మాట్లాడారు. ‘‘చంద్రబాబు-పవన్ ప్రజాస్వామ్య పరిరక్షణపై చర్చించలేదు. టీడీపీని
ఎలా రక్షించాలన్న దానిపైనే చర్చ జరిగింది. ఇది ఒక పవిత్రమైన కలయికగా
చిత్రీకరిస్తున్నారు. పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు.
చంద్రబాబు-పవన్‌కల్యాణ్ కలిస్తే బీజేపీ ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే పవన్ తమతోనే
ఉన్నారని బీజేపీ చెబుతోంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటకు బాధ్యత ప్రభుత్వం
వహించాలా? జీవో నెం.1ను తప్పు పట్టడం దుర్మార్గ ఆలోచన. పేద ప్రజలకు ఎన్ని
సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఉచితంగా ఇంకా ఇస్తామంటే వెళ్లరా.? దీనికి
ప్రభుత్వ పథకాలు అందకపోవడానికి ఏంటి సంబంధం?. పవన్‌కు అసలు సంస్కారమే లేదు.
బీజేపీతో పొత్తులో ఉండి బాబుతో లవ్‌లో ఉన్నాడు. బాబు-పవన్ కలిసి అనైతిక
రాజకీయాలు చేస్తున్నారు. వారిద్దర్ని కలిపి జగన్ బంగాళాఖాతంలో పడేస్తాడని
అంబటి వ్యాఖ్యానించారు.