నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీచంద్
మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ
మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి
ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం
హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టడమే
కాకుండా.. తాజాగా ‘జై బాలయ్యా’ అనే ఫస్ట్ సింగిల్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ
సాంగ్‌కి సంబంధించి వివరాలు తెలిపేందుకు విడుదల చేసిన లుక్స్‌లో బాలయ్య
రాయల్‌గా కనిపించి.. పాటపై, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం
తెలిసిందే. ఇప్పుడు విడుదలైన లిరికల్ సాంగ్ కూడా అంతకు మించి అనేలా ఉంది.
బాలకృష్ణని అభిమానులు నినదించే ‘జై బాలయ్యా’ అనే పదంతో రెండో సారి థమన్ చేసిన
ఈ పాటతో ఆ నినాదం ఇక ఓ మంత్రంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తంగా.. ఈ
పాటతో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్
యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.