జులై 7న కొత్త బాలాజీ మందిరానికి భూమి పూజ
రూ.70 కోట్లతో ఆలయం నిర్మిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి : ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం
ట్రస్ట్ ముంబైలో తిరుపతి బాలాజీ ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని
నిర్ణయించింది. ఈ బాలాజీ ఆలయ నిర్మాణం కోసం జూన్ 7వ తేదీన భూమిపూజ
చేయనున్నారు. భూమి పూజ కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను టీటీడీ
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి కలిసి అహ్వానించారు. నవీ
ముంబైలోని ఉల్వే నోడ్ సెక్టార్ 12లో పది ఎకరాల భూమిని ఏప్రిల్ 2022లో టీటీడీకి
కేటాయించింది మహా ప్రభుత్వం. ఇక్కడ బాలాజీ ఆలయ నిర్మాణం కోసం భూమిని ఇచ్చింది.
ఉల్వే సమీపంలో టీటీడీకి కేటాయించిన భూమి.. నవీ ముంబైలో రానున్న అంతర్జాతీయ
విమానాశ్రయానికి సమీపంలో ఉంది. టీటీడీకి కేటాయించిన భూమి విలువ రూ.500 కోట్ల
వరకు ఉంటుందని అంచనా. టీటీడీ ప్రకారం ముంబైలో కొత్త బాలాజీ ఆలయ నిర్మాణం దాతల
సహకారంతో చేపడుతున్నారు. ఈ ఆలయం కోసం రూ.70 కోట్లు ఖర్చవుతాయని టీటీడీ అంచనా
వేస్తోంది. జూన్ 7న ఆలయ భూమి పూజ కోసం టీటీడీ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు
చేస్తోంది.