వేముల
సానుకూలంగా స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
రెండు రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని హామీ
నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం కేసిఆర్ కు,ఆరోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు
తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి వరం లాంటిది అన్న మంత్రి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత
ప్రజలు డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి
నిజామాబాద్ లేదా హైదరాబాద్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి
నెలకొన్నది.వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం
భీంగల్ కేంద్రంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరిష్
రావును మంగళవారం వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన
ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి కోరిక మేరకు రెండు రోజుల్లోనే ఏర్పాటు
చేస్తామని హామీ ఇచ్చారు. మొదటగా 5 బెడ్లతో కూడిన డయాలసిస్ సెంటర్ ఏర్పాటు
చేయనున్నారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ
బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ఆరోగ్య శాఖ
మంత్రికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ డయాలసిస్ సెంటర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో
బాధపడుతున్న నిరుపేద ప్రజలకు వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్బంగా
మంత్రి వెంట నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,ఆర్మూర్ ఎమ్మెల్యే
జీవన్ రెడ్డి కూడా ఉన్నారు.