27 మందికి గాయాలు..
ఈజిప్టు రాజధాని కైరోలో శనివారం జరిగిన బాస్కెట్‌బాల్ గేమ్ స్టేడియంలో స్టాండ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఈ ఘటనలో 27 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి మోస్సన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, గాయపడిన వారిలో ఎక్కువమంది యువకులు ఉన్నారన్నారు. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కైరోలోని అల్-అహ్లీ, అలెగ్జాండ్రియాకు చెందిన ఇట్టిహాద్ల మధ్య జరిగిన సూపర్ కప్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రేక్షకుల సీట్లపై కొంత భాగం పడిపోయినప్పుడు పలువురు గాయపడినట్లు చెప్పారు.