ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బుధవారం మరో కీలక
నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టువున్న సీనియర్
రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత ‘అభయ్ కైలాస్ రావు పాటిల్ చిక్టాగావోంకర్’
బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
రావు గారి చేతుల మీదుగా గులాబీ కండువాను స్వీకరించి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అభయ్ కైలాస్ రావు పాటిల్ కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం కలదే. మహారాష్ట్రలోని
ఔరంగాబాద్ పర్భణీ పరిసర ప్రాంతాల్లో వీరికి ప్రజాభిమానం గొప్పది. ఆ
ప్రాంతాల్లో వీల్ల కుటుంబానికి మంచి రాజకీయ పట్టువున్నది. పాటిల్ తండ్రి మాజీ
ఎమ్మెల్యే కైలాస్ పాటిల్,వీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రజాసేవ చేశారు. వీరి
తాతగారు దిగంబర్ రావు వాడికర్ కూడా మాజీ ఎమ్మెల్యేనే. వీరి చిన్నాయన బావు
సాహెబ్ పాటిల్ ఎమ్మెల్యే గా రెండు సార్లు పోటీచేశారు. పాటిల్ మేనత్త ఔరంగాబాద్
మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గా గతంలో పనిచేశారు. వీరి కుటుంబం అంతా
రాజకీయనేపథ్యం కలిగినది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశన్నగారి
జీవన్ రెడ్డి తదితరులున్నారు.రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’’ అనే నినాదంతో దేశ రాజకీయాలను ప్రభావితం
చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో అటు ప్రజల మద్దతు ఇటు రాజకీయ
నాయకుల మద్దతు రోజు రోజుకూ పెరుగుతున్నది. సిఎం కేసీఆర్ నాయకత్వానికి
మహారాష్ట్ర జయ జయ ధ్వానాలు పలుకుతున్నది. మహారాష్ట్ర ప్రజల స్పందన
చూస్తుంటే… మరో రెండు మీటింగుల కల్లా ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభంజనం
ఖాయమనిపిస్తున్నది. రానున్న రోజుల్లో తెలంగాణ మోడల్’ పాలనక దేశంలో తిరుగులేని
శక్తిగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. బిఆర్ఎస్ సుప్రిమో, సిఎం
కేసీఆర్ మీటింగులకు మహారాష్ట్ర జన నీరాజనం పలుకుతుండడం జాతీయ రాజకీయ
విశ్లేషకుల వూహను మించి పోతున్నది. రాష్ట్రం గా ఏర్పడకముందు తాగునీరు లేక,
సాగునీరు లేక, వ్యవసాయానికి ఆదరణ లేక తెలంగాణ ఎట్లుండెనో ఇప్పుడు మహారాష్ట్ర
జిల్లాల్లో పరిస్థితులు కూడా అట్లనే వున్నాయి. ‘మా నీల్లు మా వనరులు మా నిధులు
మాకే’ అనే నాటి తెలంగాణ నినాదం నేడు దేశ ప్రజలకోసం మారుమోగుతోంది. తెలంగాణ
ఉద్యమ సారథిగా తనకు ఎట్లయితే తెలంగాణ ప్రజల్లోంచి మద్దతు పెల్లుబికిందో అదే
తరహా స్పందన మహారాష్ట్ర ప్రజలనుంచి కనిపిస్తుండడం గమనార్హం.