ఓయూ జెఏసి అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ
హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం
చేస్తున్న తీరుపై ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం
చేశారు.కేంద్రం రాజ్యాంగ వ్యవస్థపై దాడికి పాల్పడుతోందని అన్నారు. ఆయా
రాష్ట్రాల్లో బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై కేంద్ర
దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో
ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఆదాయపు పన్ను (ఐటి) విభాగాలను కేంద్రం
‘త్రిశూలం’లా ఉపయోగిస్తున్నదని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో
మీడియా ప్రతినిధుల సమావేశంలో భాగంగా దత్తాత్రేయ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాల నాయకులు బిజెపికి లొంగే వరకుఈ ‘త్రిశూల్’ను ఉపయోగిస్తారని
అన్నారు. ఈమధ్య ఈ మూడు సంస్థలు ప్రతిపక్షాల మీద మాత్రమే పనిచేస్తున్నాయి మొన్న
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, నిన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, నేడు తెలంగాణ
ఆడపడుచు ఎమ్మెల్సీ కవిత ఈడి, సిబిఐ బిజెపి ప్రభుత్వానికి జేబు సంస్థలుగా
మారాయి, బిజెపి పాలిత రాష్ట్రాలలోఎంత అవినీతి జరిగినా ఈడి సిబిఐ లకు చెవులు
వినిపించవు,కళ్ళు కనిపించవు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష రాజ్యాంగబద్ధ
స్థానంపై దాడిగా అభివర్ణించారు.
దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ దర్యాప్తు సంస్థలు బిజెపియేతర
ప్రభుత్వాలను ప్రభుత్వాలను అస్థిరపరచడానికి బిజెపి ఏజెంట్లుగా వీటిని
వాడుతున్నారని వీటికి తోడుగా గవర్నర్ పదవిని సైతం పావుగ వాడుకుంటున్నారని
ఎద్దేవా చేశారు.దేశంలో రాజ్యాంగాన్ని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడటానికి
ప్రస్తుతం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై ప్రజల వద్దకు
వెళ్లాలనిపిలుపునిచ్చారు. చిన్నపిల్లలు తాగే పాలు, పెరుగుపై, పెన్ను పెన్సిల్
పై జీఎస్టీ విధించిన ఘనత బిజెపి కే దక్కింది,నిత్యావసర వస్తువుల ధరలు
ఆకాశన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు అగ్గిమీద
గుగ్గిలం అవుతున్నాయి.ఈ బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తూ,గుజరాత్
కార్పోరేట్ వ్యాపారుల కొమ్ము కాసే ప్రభుత్వం అని విమర్శించారు ఈ కార్యక్రమంలో
ఓయూ జెఎసి నాయకులు రవీందర్ నాయక్ అశోక్ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.