జనసేన, బిజెపి పొత్తుతో ఎపిలో కలిసి పని చేస్తున్నాం
2024 ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మోడీ హవాతో విజయం సాధిస్తాం
బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్రం సహకారం అనే వాదనలో వాస్తవం లేదు
కేంద్ర ఎరువులు , రసాయన శాఖ సహాయమంత్రి భగవత్ కూబా
విజయవాడ : దక్షిణ భారత దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాల ఊహకందని
విధంగా బలోపేతం అవుతోందని కేంద్ర మంత్రి భగవంత్ కుబా అన్నారు. దీనికి
కారణం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలే కారణం
అన్నారు. కాంగ్రెస్ డబ్బు పంపిణీ వల్ల , ప్రాంతీయ పార్టీలు ఓటు
చీలిందనికార్ణాటక రాజకీయల పైవ్యాఖ్యానించారు. బిజెపి కి ప్రజాదరణ
తగ్గలేదు..కానీ ఇతర పార్టీ ల ఓటు కాంగ్రెస్ కి వెళ్లింది. 2024 ఎన్నికలలో
కర్నాటక లో మెజారిటీ ఎంపి స్థానాలు సాధిస్తాం. తమిళనాడు , కేరళ లో బిజెపి
బలోపేతం అవుతోందన్నారు. తెలంగాణ లో అధికారం చేజిక్కించుకుంటాం అన్నారు. ఎపి
లో బిజెపి కి ప్రజాదరణ పెరిగిందన్నారు. జనసేన, బిజెపి పొత్తుతో ఎపిలో కలిసి
పని చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా చెబితే అది వారి సొంత అభిప్రాయం. మోడీ
తొమ్మిదేళ్లలో పూర్తి పారదర్శకమైన పాలన అందిస్తున్నారు. మోడీ మంచి పాలన
అందిస్తున్నారనే నమ్మకం ప్రజల్లో ఉంది. 2024 ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మోడీ
హవాతో విజయం సాధిస్తాం. దేశ ఆర్ధికాభివృద్ధి ఎంతో పెరిగింది. భారత్లో
పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. సుస్థిరమైన
ప్రభుత్వం, సమర్ధవంతంగా మోడీ పాలనే ఇందుకు కారణం. మహారాష్ట్ర లో శివసేన బిజెపి
తోనే ఉంది. మమతా బెనర్జీ, కెసీఆర్ విధ్వంసకర విధానాలు అమలు చేస్తున్నారని
కేంద్రమంత్రి మండిపడ్డారు. పురోగతి లేక అప్పుల ఆంధ్రప్రదేశ్ గా
మారిందన్నారు. బిజెపి మాత్రం ఎపి రాజధాని అమరావతి కే కట్టుబడి ఉంది. మా పార్టీ
విధానం లో మేమంతా పని చేస్తాం. బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్రం సహకారం అనే
వాదనలో వాస్తవం లేదు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కేంద్రం
కోరుకుంటుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో ఆరోపణలు
చేస్తున్నారు. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుంది. పోలవరం
పై ఎపి ప్రభుత్వం వైఖరి సరిగా లేదు. చేసిన పనులకు బిల్లులు పూర్తి గా
ఇవ్వలేదు. నీతి ఆయోగ్, ఎపి ప్రభుత్వం పోలవరం పై చర్చించుకోవాలి. ఎపి కి
పునర్విభజన చట్టం లో అంశాలను చాలా వరకు అమలు చేశాం. కేంద్రమంత్రి తో పాటు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి, సహ ఇంఛార్జి
సునీల్ దేవదర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, చందు
సాంబశివరావు, లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు.