పాలకుర్తి : దేశంలో రైతు సర్కారు లక్ష్యంగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈనెల 18వ
తేదీన ఖమ్మంలో నిర్వహించే బి ఆర్ ఎస్ పార్టీ తొలి బహిరంగ సభను విజయవంతం
చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీతి సరఫరా శాఖల
మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పూర్వ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ
కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి సందేశంగా ఈ బహిరంగ
సభ ఉంటుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అమలు
చేయని, కనీసం అమలు చేయడానికి సాహసించని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు
చేసి, విజయవంతం చేశారన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని రాయపర్తి, తొర్రూరు,
పెద్ద వంగర మండల పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో నేడు మాట్లాడారు. మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 18న బి.ఆర్.ఎస్ తొలి బహిరంగ సభకు పెద్ద ఎత్తున
ప్రజలు తరలిరావాలని కోరుతున్నాను.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
24 గంటల ఉచిత కరెంట్ అంటే ఏటా 10,500 కోట్ల రూపాయలు డిస్కం లకు
చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరి మీద కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయిలు
చెల్లిస్తున్నాం. 63 లక్షల మంది రైతులకు 15వేల కోట్ల రూపాయలు రైతు బందు కింద
రైతు పెట్టుబడి సాయం చేశాం. ఇప్పటికీ 58వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద
ఇచ్చాం. దళిత బంధు ఇస్తున్నాం. వచ్చే బడ్జెట్ లో గిరిజన బడ్జెట్
ఇవ్వబోతున్నారు సీఎం కేసీఆర్ . పాలకుర్తి, జాఫర్ ఘడ్, కొడకండ్ల, ఘన్ పూర్
ప్రాంతాలు డార్క్ ఏరియాగా ప్రకటించారు. బోర్లు వేయొద్దు అన్నారు. వేసినా నీరు
రాలేదు. కానీ తెలంగాణ వచ్చాక, కాళేశ్వరం తెచ్చాక నేడు బోర్ల నిండా నీళ్ళు
వస్తున్నాయి. నిండుగా కాలువలు పారుతున్నయి. ఇలాంటి పాలనను భారత దేశంలో ఎందుకు
ఇవ్వలేము? అని ఆలోచించి సీఎం కేసీఆర్ బి.ఆర్.ఎస్ పార్టీ పెట్టారు. తెలంగాణలో
సాధ్యం అయ్యింది దేశంలో చేయాలనేది సీఎం సంకల్పం. దేశంలో ఉన్న నాయకులకు దూర
దృష్టి, ఆలోచన, సంకల్పం లేక ఏమి జరగ లేదు. ఈ అజెండాతో పెట్టే బి.ఆర్.ఎస్ మొదటి
బహిరంగ సభ. మీరు అంత వచ్చి విజయవంతం చేయాలి. ఈ సమావేశంలో స్థానిక
ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు,
రైతు బంధు సమన్వయ కర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.