ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట
చంద్రశేఖర్ సమక్షంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాము సూర్య రావు
తనయుడు రాము శ్రీనివాస్ సహా పలువురు జిల్లాకి చెందిన నాయకులు , కార్యకర్తలు
ఏపీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట
చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్
అధ్యక్షులు , తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట
చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వంలో తామంతా పనిచేస్తామని అన్నారు నేతలు. తెలంగాణ
మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావడానికి కృషి చేస్తామని తెలిపారు.