కొవిడ్ అత్యవసర సన్నద్ధతపై ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఆక్సిజన ప్లాంట్లు, వెంటిలేటర్లు, మానవ వనరులు, అంబులెన్స సేవలు తదితరాల పరిశీలన చేపట్టనున్నారు. ఈ డ్రిల్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్ మాండవీయ కూడా పాల్గొంటారు. శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నిర్వహించిన సమీక్షలో మాండవీయ ఈ వివరాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను సమావేశంలో వివరించారు. సర్వసన్నద్ధంగా ఉంటూ, గతంలోలా సమష్టిగా కదిలి కొవిడ్‌కు అడ్డుకట్ట వేయాలని సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకాతో పాటు మార్గదర్శకాల పాటింపు, పాజిటివ్ శాంపిళ్ల జన్యు విశ్లేషణ, వ్యాక్సినేషనపై ఈ సమావేశంలో చర్చించారు. పండుగల సీజన కాబట్టి.. కొవిడ్ మార్గదర్శకాల పాటింపుపై ప్రజలను చైతన్యం చేయాలని మాండవీయ కోరారు. ఔషధాల అందుబాటు సహా ప్రతి విషయాన్ని రాషా్ట్రల ఆరోగ్య మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. ప్రస్తుతం పది లక్షల జనాభాకు టెస్టుల సంఖ్య 79గా మాత్రమే ఉందని.. ఈ సంఖ్యను పెంచాలన్నారు. వదంతుల వ్యాప్తిని నిరోధించాలని, అర్హులందరికీ టీకా పంపిణీ చేయాలని సూచించారు. కాగా, అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకాలను సవరించి.. కొత్తగా విడుదల చేసింది. ర్యాండమ్‌గా శనివారం నుంచి 2 శాతం ప్రయాణికుల శాంపిళ్లను సేకరించనున్నారు. పరీక్ష ఖర్చును తొలుత ప్రయాణికులే భరించాలి. విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు పూర్తి వివరాలు అందిస్తే.. ఆ డబ్బును తిరిగి చెల్లిస్తారు. కాగా, పండుగల సీజన నేపథ్యంలో జనం గుమిగూడకుండా, రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ భూషణ్ శుక్రవారం రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇనఫ్లుయెంజా తరహా వ్యాధుల వ్యాప్తిపై జిల్లా స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. తద్వారా కొత్త వేరియంట్ కేసులను సత్వరమే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.