తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు
నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు నమ్మితే ఆత్మహత్య సదృశ్యమనీ, కేసీఆర్
అధికారంలోకి వస్తే జలదృశ్యం సాకారమవుతందని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్
రావు తెలిపారు. తెలంగాణ ప్రజలు జలదృశ్యం కావాలో, ఆత్మహత్య సదృశ్యం కావాలో
తేల్చుకోవాలని ఆయన సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి
హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.