కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్..
కలువాయి మండలం బాలాజీ రావు పేట, తోపుకుంట అగ్రహారం గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా కిసాన్ మో ర్చా ప్రధాన కార్యదర్శి నరసింహ ప్రసాద్ చౌదరి “పల్లెకు పోదాం “కార్యక్రమంలో నిర్వహించారు.గ్రామాల్లోని
ఇంటి ఇంటికి వెళ్ళి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలు కోసం అమలు జేసిన సంక్షేమ పధకాల గురించి తెలియ జేశారు. ఈ సందర్బంగా ఆయన కరపత్రాలు, క్యాలెండర్ లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చంద్ర మోహన్ గారు మరియు స్థానిక నాయకులు శ్రీను, రవీంద్ర, శేఖర్, హరికృష్ణ తదితర నాయకులు రైతులు పాల్గొన్నారు.