ఎస్ ఎస్ ఆర్ నాయుడు.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
రాష్ట్రము లో కుల తత్వం ప్రాంతీయ పార్టీ ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గం కన్వీనర్ ఎస్ ఎస్ ఆర్ నాయుడు చెప్పారు. గౌ చెలియో అభియాన్ కార్యక్రమం ఈ నెల 9 నుంచి గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలియజేసారు.
కలువాయి లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ….
బీజేపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గౌ చెలియో అభియాన్ కార్యక్రమం మూడు రోజులు పాటు జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పధకాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తారని చెప్పారు.రాష్ట్రం లో కులత్తత్వాపార్టీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కులాలు మతాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం బీజేపీ కి ఇవ్వాలని అభ్యరించారు.బీజేపీ అధికారం లోనికి వస్తే ఈ ప్రాతం సర్వవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.ఈ సమావేశం లో బీజేపీ మండల అధ్యక్షులు మల్లికార్జున, మాజీ అధ్యక్షులు పెంచలయ్య, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.