ఇక్కడ ముద్దు అంటోంది.. అక్కడ వద్దు అంటోంది. ఇది బీజేపీ డబుల్ స్టాండ్ కు
నిదర్శనం.. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టుకుంటున్న బీజేపీ.. తెలంగాణ
లో మాత్రం జనసేన వద్దు అంటోంది.. దానికి కారణం ఏంటో తెలుసా..?జనసేన పార్టీకి
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు రాష్ట్రాలలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ
తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారం చెపట్టాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ అక్కడ
జనసేనను చాలా లైట్ తీసుకుంది. అదే సమయంలో ఏపీలో మాత్రం జనసేన తో జతకలిసి
పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్య పొత్తు
ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆంధ్రలో పవన్ కళ్యాణ్ కు త్వరలోనే
రోడ్ మ్యాప్ ఇస్తామని, పొత్తులపై తొందరపాటు నిర్ణయిలు తీసుకొవద్దని విశాఖ
పర్యటన సందర్భంగా సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో
అసెంబ్లీకి పోటీచేసే తమ అభ్యర్ధుల జాబిత అంటూ జనసేన 32 మంది పేర్లు
ప్రకటించింది. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాలకు సైతం తమ అభ్యర్ధులను
ప్రకటిస్తామని కూడా ఆ పార్టీ తెలియజేసింది. అంటే తెలంగాణలో జనసేన-బీజేపీల మధ్య
పొత్తు లేనట్లే భావించాలి.

హైకమాండ్ రూట్ మ్యాప్ ఇవ్వడం లేదా ? : ఏపీ బీజేపీ కి రాజకీయాల్లో ఎలా ముందడుగువేయాలన్న స్పష్టత లేకుండా పోయింది. హైకమాండ్ నుంచి స్పష్టత లేకపోవడంతో నేతలు
కూడా జోరు తగ్గించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర చాలా
పరిమితం. కానీ దేశం మొత్తం బీజేపీ పురోగమిస్తూంటే ఏపీలో మాత్రం ఒక్క అడుగూ
ముందుకు పడటం లేదు. ఒక్కో సారి ప్రభుత్వంపై పోరాటం అంటూ కార్యక్రమాలు
నిర్వహిస్తారు. జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతారు కానీ అది వన్ సైడ్ మాత్రమే
ఉంటుంది. జనసేన వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ప్రకటన రాదు. ఇటీవల నుంచి బీజేపీ
నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. మీడియాలో కూడా హడావుడి తగ్గించారు. ఇదేమైనా
వ్యూహమా లేకపోతే నాయకత్వంలో స్తబ్దత ఏర్పడిందా అన్నది క్యాడర్ కు కూడా
క్లారిటీ లేకుండా పోయింది.జనసేనతో పొత్తు నిలుపుకునే ఆలోచన ఉందా ? లేదా ? : జనసేన పార్టీ తాను వైసీపీ
ముక్త ఏపీ కోసం పని చేస్తానని ప్రకటించింది. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా
చూసుకుంటానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఆయన ఒకే మాట మీద ఉన్నారు. అయితే
బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో కలిసే పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ
వీరి వైపు ఒక్కరంటే ఒక్క జనసేన నేత కూడా మాట్లాడటం లేదు. తాము బీజేపీతో
పొత్తులో ఉన్నామని అంటున్నారు కానీ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని మాత్రం
చెప్పడం లేదు.