విజయవాడ : ఎమ్మెల్సీ లుగా 11 మందికి బీసీలకు పదవులు అంటూ బీసీలను
సామాజిక న్యాయం పేరిట అధికార పార్టీ మోసం చేస్తోందని చేస్తున్నారని జనసేన పార్టీ నగర
అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అన్నారు. శాసనమండలి ఎప్పుడైనా రద్దు
అవుతుందనే విషయాన్ని కొత్తగా ఎమ్మెల్సీ లు గా ప్రకటించబడిప వారు గుర్తుంచుకోవాలని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రద్దు కాబోయే శాసన మండలి లో బీసీలకు ఇచ్చిన 11
ఎమ్మెల్సీ పదవులు తుమ్మితే ఊడిపోయే పదవులు లాంటివి. దీనివల్ల బీసీలకు ఒరిగే
ప్రయోజనం ఏమీ లేదన్నారు.