అమరావతి : బీసీలకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ హామీ
ఇచ్చారు. రాజ్యాధికారం అర్థించడం కాదని, సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అర్ధ
రూపాయికి ఓటు అమ్ముకుంటే.. ఎప్పటికీ దేహీ అనాల్సి వస్తుందన్నారు. తాను ఒక
కులానికి మాత్రమే ప్రతినిధిని కాదని, ప్రజలందరికీ ప్రతినిధిగా
ఉండాలనుకుంటున్నానని ప్రకటించారు. తెలంగాణ లో 26 కులాలను బీసీ జాబితా నుంచి
తొలగించారని, బీసీ కులాల తొలగింపుపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్
చేశారు. ‘‘బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్.
బీసీల్లో అనైక్యత వల్లే ఇతరులు బలంగా ఉంటున్నారు. బీసీలకు రాజకీయ సాధికారితే
కాదు.. ఆర్ధిక పరిపుష్టి కావాలి. బీసీల సదస్సుకు వస్తారు. కానీ, బీసీలకు
ఎందుకు ఓటు వేయరు?.. కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. మంత్రి
బొత్స సత్యనారాయణ పెరిగితే తూర్పుకాపులంతా పెరిగినట్లు కాదు. ఎస్సీ, ఎస్టీలకే
కాకుండా బీసీలకూ ఉపప్రణాళికా నిధులు ఉండాలి. బీసీలను జగన్ ప్రభుత్వం మోసం
చేసిందని పవన్‌కల్యాణ్ మండిపడ్డారు.
అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది : రాష్ట్రంలోని అన్ని
బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని జనసేన అధినేత పవన్
కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ
సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు..
సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన
పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు.
ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో
93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ‘‘భారాస
పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించింది. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా
నుంచి తొలగించడంపై భారాస స్పందించాలి. అన్యాయంపై భారాస వివరణ ఇవ్వాలి. బీసీ
కులాల తొలగింపుపై వైకాపా, తెదేపా స్పందించాలి. బీసీలకు జనసేన అండగా ఉంటుంది.
చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తా. మీ ఓట్లే
మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు
అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో
తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో
ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ
నాయకుడిగా ఉండాలనుకుంటున్నాన ని పవన్ కల్యాణ్ తెలిపారు.