విజయవాడ : టిటిడి చైర్మన్ పదవికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డాక్టర్
దేరంగుల ఉదయ్ కిరణ్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు
ఈ పదవికి సీఎం జగన్ వద్ద ముగ్గురు పోటీ పడ్డారు. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే
భూమా కరుణాకర్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వీరితోపాటు జాతీయ
బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్, కొత్తగా మేకపాటి రాజా మోహన్ రెడ్డి
పేరు కూడా తెరపైకి వచ్చింది. సీఎం పలు దఫాలు ఆలోచించి రెడ్డి కులస్తులకు
ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ చైర్మన్ ఇవ్వకూడదని దృఢ సంకల్పంతో ఉన్నట్లు
సమాచారం. బీసీలకే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని ఆయన దృఢ నిశ్చయంతో
ఉన్నట్లు తెలిసింది, ఈ నేపథ్యంలో డేరంగుల ఉదయ్ కిరణ్ తో పోటీపడుతున్న మరో బీసీ
నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి నాలుగు రోజుల క్రితమే బీసీ సెల్ రాష్ట్ర
అధ్యక్షుడు పదవి కట్టబెట్టి దేరంగుల పదవి కి లైన్ క్లియర్ చేసినట్లు
విశ్వాసనీయ సమాచారం. దేరంగుల ఉదయ్ కిరణ్ జగన్ వైసిపి పార్టీ స్థాపించినప్పటి
నుంచి ఆయన వెంటనే నడుస్తూ టిడిపి , జనసేన పార్టీలను ఎండగడుతూ బీసీలను
ఏకత్రాటిపై తెచ్చి వారందరినీ వైసీపీ మద్దతు దారులుగా నిలిచేటట్లు కృషి చేశారు.
అంతేకాక జగన్ పాదయాత్ర లోను ఆయన వెన్నంటేనే నడిచి ఆయన మనసుని ఆకట్టుకున
వ్యక్తి దేరంగుల ఉదయ్ కిరణ్ జగన్ మనసులో సుస్థిర స్థానాన్ని
ఏర్పరచుకున్నారు, అప్పుడే జగన్ దేరంగులతో మన పార్టీ అధికారంలోకి వస్తే
పార్టీకి మీ సేవలు గుర్తించుకొని మీకు సముచిత స్థానం ఇస్తామని జగన్ ఆనాడు
దేరంగులతో చెప్పిన మాటలను బీసీలంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
టీటీడీ చైర్మన్ గా డేరంగుల ఉదయ్ కిరణ్ నియమిస్తే బీసీలు జగన్ ను ఎన్నటికీ
వీడేది లేదని ఘంటాపదంగా చెబుతున్నారు. రాష్ట్రంలో వడ్డెర కులస్తులకు
ఎవ్వరికీ ఇంతవరకు వైసీపీ పార్టీలో ఎటువంటి సముచిత స్థానం లభించినప్పటికీ
ఇప్పుడు అదే కులానికి చెందిన దేరంగుల ఉదయ్ కిరణ్ కు టీటీడీ చైర్మన్ పదవిని
కట్టబెడుతున్నారన్న వార్తలతో వడ్డెరలంతా హర్షాతిరేకాలు వ్యక్తం
చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత డేరంగుల ఉదయ్ కిరణ్ కు టిటిడి చైర్మన్
గా నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.