ఇదేం కర్మ ప్రోగ్రామ్ పేరును బీసీలపై దాడులని తెలుగుదేశం పార్టీ మార్చుకోవాలి
బీసీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి
చంద్రబాబునాయుడు ఓర్చుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు
బీసీలకు జగనన్న చేస్తున్న మంచి ని చూసి ఓర్చుకోలేక టీడీపీ విధ్వంసం
సృష్టించాలని చూస్తోంది
వాళ్ల ఆటలు సాగవు. వారికి బీసీ సోదరులే బుద్ధి చెబుతారు
చిలకలూరిపేటలో మీడియాతో రాష్ర్ట ఆరోగ్య శాఖమంత్రి విడదల రజని
అమరావతి : బీసీల ద్రోహిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచిపోతాడనేదానికి
మాచర్ల ఘటన కూడా తాజా నిదర్శనం అని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి విడదల రజని
అన్నారు. మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి ఘటనపై చిలకలూరిపేటలో
రాష్ర్ట ఆరోగ్య శాఖమంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడారు. బీసీలపై
హత్యాప్రయత్నానికి పాల్పడ్డవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం.
వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలు
పర్యవేక్షించేందుకు ఎలాంటి చర్యలకైకా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
అమాయక బీసీలపై దాడులకు తెగబడిన వారు ఎలాంటి వారైనా సరే చర్యలు
తీసుకుంటాం.ఇదేం కర్మ ప్రోగ్రామ్ పేరును బీసీలపై దాడులు అని తెలుగుదేశం
పార్టీ మార్చుకోవాలని అన్నారు. బీసీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి
పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబునాయుడు ఓర్చుకోలేకపోతున్నారు. బీసీలంతా
జగనన్న వెన్నంటి ఉన్నారనే కక్ష్యతో టీడీపీ గూండాలపై బీసీలపై దాడులకు
దిగుతున్నారు. మాచర్ల లో నిన్న రాత్రి మా బీసీ సోదరులపై టీడీపీ గూండాలు
దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యలను తీవ్రంగా
ఖండిస్తోంది అని అన్నారు. ఇలాంటి దాడులకు తెగబడేవారిని మేం వదిలిపెట్టం.
బీసీల జోలికి ఎవరు వచ్చినా వారి సంగతి తేలుస్తాం అని తెలిపారు. ప్రశాంతంగా
ఉన్న పల్నాడులో తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలకు దిగుతోందని అన్నారు.ఈ
రోజు బీసీలపై జరిగిన దాడికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి. టీడీపీ
గూండాల రాళ్ల దాడిలో గాయపడిన మా బీసీ సోదరులను పరామర్శించాల్సింది పోయి
చంద్రబాబు, లోకేష్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు.