ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి
కడప : బీసీల పట్ల వైసీపీ, టీడీపీలది కపట ప్రేమ మాత్రమే అని.. బీసీల నిజ
నేస్తం కాంగ్రెస్ ఒక్కటే అని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్
డాక్టర్ ఎన్.తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ
1970 లోనే విద్యా, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 25 శాతం రిజర్వషన్లు
కల్పించిందని తెలిపారు. 1993లోనే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు
34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. అలాగే 2008లో కాంగ్రెస్
పార్టీ బీసీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ పథకాలను
ప్రారంభించిందన్నారు. 1994లోనే కాంగ్రెస్ పార్టీ సచివాలయంలో బీసీ
డిపార్ట్మెంట్ను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ 4 బీసీ
కమిషన్లు, బీసీ హాస్టళ్లు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించిందని
తెలిపారు. ఇప్పటికైనా వైపీనీ, టీడీపీలు బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడం
మానుకోవాలని తులసిరెడ్డి హితవుపలికారు.