పట్నా: బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ
పోస్టుల భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని
ప్రకటించింది. నితీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన
ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్
సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో
బిహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. తాజాగా కేబినెట్
తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి
నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ్ తెలిపారు. ఈ రోజు రాష్ట్ర
కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బిహార్లోని 1.78 లక్షల
ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బిహార్ పబ్లిక్
సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి
భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు.