విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఎ.పి. ఎన్.జి.వో. సంఘం బురద
జల్లుడు కార్యక్రమం ఆపకపోతే తాము అంతే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ గ్రామ
రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు
కె.ఆర్. సూర్యనారాయణ పై వ్యక్తిగత దూషణలకు దిగడం, తమ సంఘ గుర్తింపు
రద్దుచేయాలన్న ఎ.పి.ఎస్.జి.వో. సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు,
ప్రధానకార్యదర్శి, శివారెడ్డిపై ఎ.పి.జి.ఇ.ఎ. నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంఘ రాష్ట్ర కార్యవర్గం కె.ఆర్.
సూర్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక బకాయిల
అంశంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలవడం పట్ల ఎ.పి. ఎన్ .జి.వో. నాయకులకు
వచ్చిన అభ్యంతరాలు ఏంటో తెలపాలని, ఒక రాష్ట్ర ప్రధమ పౌరుడ్ని, ఆయన
కొలువుదీరిన ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులుగా గవర్నరును కలవడం ఏవిధంగా రూల్స్
కు విరుద్దమో తెలపాలని డిమాండ్ చేశారు. జీతభత్యాల కోసం చట్టం చేయాలని
ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను అడగడం ప్రజాస్వామ్యయుతమైన హక్కులలో
భాగమేతప్ప విరుద్ధం కాదన్నారు. మరి ముఖ్యంగా తమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు
సూర్యనారాయణను వ్యక్తిగతంగా పేరుపెట్టి ఖబద్దార్ అని హెచ్చరించడం బండి
శ్రీనివాస్ కే చెల్లినట్లు ఉందని, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో రెండు సంవత్సరాలు
ఉద్యోగ కాలాన్ని పెంచుకున్న ఆయన ఈ విధమైన చౌకబారు వ్యాఖ్యలు ద్వారా ఋణం
తీర్చుకుంటున్నారా ? అని ఎ.పి.జి.ఇ.ఎ. ప్రతినిధులు ప్రశ్నించారు.కారుణ్యనియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను కూడా కించపరిచే విధంగా బండి
శ్రీనివాసరావు మాట్లాడడాన్ని ఉద్యోగుల పట్ల ఆయనకు గల నిబద్ధతను
తెలియచేస్తుందన్నారు. 62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు పెంపు వద్దని తమ సంఘం
ఇటువంటి వారి కోసమే అభ్యంతరం తెలిపిందన్నారు. ఇక ఎ.పి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ
గుర్తింపు రద్దు కొరకు గౌరవ హైకోర్టులో రెండు కేసులు వేసిన ఎ.పి.ఎన్.జి.వో.లు
ఎటువంటి ఉత్తర్వులు పొందలేదన్నారు. న్యాయస్థానంలో ఉపసమనం లభించని తరువాత
మాత్రమే ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదు చేసి తమ గుర్తింపును రద్దు చేయాలని ఒక
అక్రమ ఫిర్యాదును చేయగా దానిని తిరస్కరిస్తూ లిఖితపూర్వక సమాధానం
ఎ.పి.ఎన్.జి.వోలకు ప్రభుత్వ లెటర్ నెం. 11/24/2020, తేది. 03-06-2020 ద్వారా
పొందిన ఎ.పి. ఎన్ .జి.వో. సంఘం మరల ఏవిధంగా గుర్తింపును రద్దు చేయాలని
ఫిర్యాదు చేస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తమ సంఘం ఎ.పి.ఎన్.జి.వో.లు వారి
సంఘ భవనాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేసి లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ
ప్రభుత్వానికి జమా ఖర్చులు సైతం చూపించకుండా పన్నులు ఎగకొడుతున్నారన్న
ఫిర్యాదుకు నేటికీ తమ సంఘం కట్టుబడి ఉన్నట్లు నేతలు తెలిపారు.