న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప
ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోదియా బెయిల్ కోసం సుప్రీం కోర్టును
ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు లో సిసోదియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను
న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఉన్నత
న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కుంభకోణం
కేసులో మనీశ్ సిసోదియాను ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ
తర్వాత ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మే 9న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు
చేసి తిహాడ్ జైలులోనే విచారించారు. గత మే 30న బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో
పిటిషన్ దాఖలు చేయగా నిరాశే ఎదురైంది. మరోసారి ఆశ్రయించగా ఈ దశలో బెయిల్
మంజూరు చేయలేమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సిసోదియాతో
పాటు ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, వినయ్‌బాబు, విజయ్
నాయర్‌కు సైతం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.