మెదక్ : మెదక్ జిల్లాలోని నార్లాపూర్ వద్ద బొల్లికుంట చెరువులోకి గోదావరి
జలాలను వదిలారు. దీనితో ఇక బోర్లు, బావులలో ఊట పెరుగుతుందని, ఎప్పుడు కాల్వలో
నీటి ప్రవాహం ఉంటుందని, చెరువులు, కుంటలు నింపుకోవడం ద్వారా రెండు పంటలు
పండించుకోవచ్చని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులు 365 రోజులు కడుపునిండా
తినవచ్చు అన్నారు. దీనిని ప్రారంభించిన కొద్ది సేపటికే కాలువకు గండిపడి
దిగువనున్న రైతుల పొలాల్లో నీరు ప్రవేశించి పంట నష్టం జరిగిందని బీజేపీ మండల
అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూద్దామనుకున్న తరుణంలో
కాల్వ గండిపడి పంట నష్టపోయారని ఆయన విమర్శించారు. రైతులు ముఖాన్ని ఆకాశానికి
చూసే అవసరం లేకుండా ముఖ్యమంత్రి కాళేశ్వరం జలాలను తాగునీటికి, సాగునీటికి
అందిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిజాంపేట మండలం నార్లాపూర్ వద్ద
బొల్లికుంట చెరువులోకి గోదావరి జలాలను వదిలారు. ఈ సందర్భంగా నార్లాపూర్‌లో
ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.కరీంనగర్ జిల్లాలోని మేటిగడ్డ నుండి 530 మీటర్ల ఎత్తున గోదావరి జలాలను
ఎత్తిపోస్తూ 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌కు నీటిని తీసుకువచ్చామని
ఆయన అన్నారు. ఇక బోర్లు, బావులలో ఊట పెరుగుతుందని, ఎప్పుడు కాల్వలో నీటి
ప్రవాహం ఉంటుందని, చెరువులు, కుంటలు నింపుకోవడం ద్వారా రెండు పంటలు
పండించుకోవచ్చని తెలిపారు. రైతులు 365 రోజులు కడుపునిండా తినవచ్చు
అన్నారు.కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతోంది: బోరు బావి కాడ మీటర్లు పెడితే
రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతుందని, బడ్జెట్లో
నిధులు కొత పేడుతున్నదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కాంక్షించి
ఉచిత విద్యుత్ అందిస్తున్నదని హరీశ్ అన్నారు. ప్రభుత్వం సంపద సృష్టించి
అందరికి పంచుతుంటే కేంద్రం నిందలు వేస్తోందని, బడుగు బలహీన వర్గాల
సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్,
కేసీఆర్ కిట్ వంటి పథకాలు అందిస్తున్నదని వివరించారు.