బాలీవుడ్లో సంచలనం సృష్టించిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర. బాలీవుడ్లో అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న వేళ కొన్ని పరుగులు తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో రణ్‌బీర్ ఆలియా భట్ జంటగా నటించారు. ఇప్పుడు బ్రహ్మస్త్ర పార్ట్ 2 గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారనే క్యూరియాసిటీ పెరిగింది. శివుడిగా రణబీర్ కపూర్ తొలిసారిగా ఆలియాతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో సౌత్ సూపర్ స్టార్ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది మరెవరో కాదు కేజీఎఫ్ స్టార్… కన్నడ స్టార్, రాకింగ్ స్టార్ యష్. బ్రహ్మస్త్ర 2 విషయంలో యష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర 2లో దేవ్‌గా నటించేందుకు యష్‌ని సంప్రదించినట్లు సమాచారం.
పింక్విల్లా తాజా నివేదిక ప్రకారం, యష్ ఈ విషయంలో ఏమీ నిర్ణయించడం లేదని చెప్పబడింది. కేజీఎఫ్ 3కి సంబంధించిన ఫాలో-అప్ కోసం 100 శాతం వర్క్‌ని పర్ఫెక్ట్గా ఉంచాలని యష్ కోరుకుంటున్నట్లు పింక్ విల్లా పేర్కొంది. మరోవైపు బ్రహ్మస్త్ర 2పై వస్తున్న వార్తలపై కరణ్ స్పందించారు. అవన్నీ ఫేక్ అంటూ కొట్టి పడేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు’ అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్.