బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ అధికారికంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎమ్సియు అభిమానులు అద్భుతమైన సమిష్టి ప్రదర్శనపై విపరీతంగా ఉన్నారు. షురి పాత్రను తిరిగి తానే పోషించిన లెటిటియా రైట్ ధైర్యంగా నడిపించారు. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం టెనోచ్ హుర్టాను నామోర్, కింగ్ ఆఫ్ తలోకన్గా పరిచయం చేసింది. ‘బ్లాక్ పాంథర్’లో సహాయక పాత్రకు పరిమితం అయిన లెటీటియా రైట్‌కు ఇందులో ప్రధాన పాత్ర దక్కింది. ఈ అవకాశాన్ని తను చక్కగా ఉపయోగించుకుంది. ఎమోషనల్ సీన్లలో అద్బుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లలో ఆకట్టుకుంటుంది. నమోర్ పాత్రలో కనిపించిన టెనాక్ హుయెర్టా సూపర్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రలో చక్కగా నటించారు. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. సాధారణ ప్రేక్షకులు అక్కడక్కడా డిస్కనెక్ట్ అయినా ఓవరాల్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. చాడ్విక్ బోస్‌మన్‌కు ఈ సినిమా ఘనమైన నివాళి. అయితే ర్యాన్ కూగ్లర్ ఎమోషనల్ సీన్లను కాస్త తగ్గించి ఉంటే బాగుండేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ నిడివి 2 గంటల 44 నిమిషాలు. రెగ్యులర్ హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కాబట్టి రన్ టైం కొంచెం తగ్గించుకుని ఉండాల్సిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.