కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా భద్రాచలం రోడ్ – సత్తుపల్లి మధ్య నూతన
రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై
సౌందరరాజన్ , రాష్ట్రం, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర రసాయనాలు , ఎరువులు, నూతన పునరుత్పాదక ఇంధనం
మంత్రి భగవంత్ ఖుబా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ
కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్,
సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ఎ .కె.గుప్తా , ఇతర సీనియర్
రైల్వే అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ
రాష్ట్ర ప్రజలకు చాలా ప్రాముఖ్యమైన రోజని, రూ. 10,000 కోట్ల వ్యయంతో
చేపట్టిన అనేక కీలక అభివృద్ధి పథకాలను దేశ సేవకు అంకితం చేస్తున్నామని
తెలిపారు. గడచిన 8 ఏళ్లలో దేశ సర్వతోముఖాభివృద్ధికి ఎన్‌డిఎ ప్రభుత్వం అనేక
ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందని, దీంతో భారత్ త్వరలో ప్రపంచంలోనే
3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరుకునేందుకు మార్గం సుగమం అయిందని ఆయన
పేర్కొన్నారు. జాతీయ ప్రణాళిక ప్రాజెక్ట్ లో భాగంగా ప్రధానమంత్రి గతి శక్తి
ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం అంతటా రైలు, రోడ్డు, వాయు, నీరు మరియు ఇంటర్నెట్
అనుసంధానతను మెరుగుపరుస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు. ఇందుకు
అనుగుణంగా భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టును
ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిద్వారా దేశంలోని పద్నాలుగు అతి
ముఖ్యమైన బొగ్గు తరలింపు ప్రాజెక్టుల జాబితాలో చేర్చడం జరిగిందని అయన తెలిపారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 4 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో
విద్యుదీకరణతో పాటు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి
ప్రారంభించటానికి వీలు కల్పించడం జరిగిందన్నారు . వెనుకబడిన మరియు గిరిజన
ప్రాంతాల సామాజిక ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించడానికి మా ప్రభుత్వం యొక్క
ప్రాధాన్యతకు అనుగుణంగా, ఈ కొత్త రైలు మార్గం గుండా ప్రయాణంచే ప్రాంతాల
పురోభివృద్దితో కూడిన ప్రగతి సాదించేందుకు అలాగే ఈ ప్రాంత ప్రజల
శ్రేయస్సు, గణనీయమైన వృద్ధి సాదించేందుకు ఈ ప్రాజెక్ట్ నూతన శకానికి ఒక
నాందిగా నిలువనుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి,
కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అభివృద్ధికి నూతన రైల్వే లైన్ ప్రాజెక్ట్
దోహదపడుతుందని నరేంద్ర మోడీ తెలిపారు. రైల్వే లైన్ ప్రజలకు, పరిశ్రమలకు
సురక్షితమైన, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా విధానాన్ని అందిస్తుందని,
యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర
అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అనేక ప్రతిష్టాత్మకమైన
కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. మెదక్ – సిద్దిపేట – ఎల్కతుర్తి తో పాటు
బోధన్ – బాసర్ – భైంసా మరియు సిరోంచ – మహదేవ్పూర్ విభాగాలు నిర్మాణం కోసం
రూ. 2,268 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్రంలో 3 జాతీయ రహదారుల విస్తరణను
కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలియజేశారు. అలాగే రామగుండంకు ఇఎస్ఐ
ఆసుపత్రిని మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్
మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, భద్రాచలం రోడ్ – సత్తుపల్లి కొత్త రైల్వే లైన్
ప్రాజెక్ట్ యొక్క ముఖ్య విశేషాలను వివరిస్తూ ప్రధాన మంత్రికి సంక్షిప్త
ప్రదర్శనను అందించారు. భద్రాచలం రోడ్ – సత్తుపల్లి రైల్వే లైన్ గనుల నుండి
రైల్ లోడింగ్ టెర్మినల్ వరకు రోడ్డు రవాణాలో ఉన్నఇబ్బందులను ,సమస్యలను
పూర్తిగా నివారించడమే కాకుండా వాటిని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
ఓపెన్ కాస్ట్ గని వద్ద ఉన్న రైల్వే టెర్మినల్ నుండి బొగ్గును ఇప్పుడు నేరుగా
కన్వేయర్ల నుండి పొందే బొగ్గు ను రవాణా చేయవచ్చు. 200 మెట్రిక్ టన్నుల కంటే
అధిక బొగ్గు నిల్వలతో, ఈ ప్రాజెక్ట్ రాబోయే 30 సంవత్సరాలలో రైల్వే ద్వారా
బొగ్గు రవాణాచేసే అవకాశం ఉంది. ఈ కొత్త లైన్ విభాగంలో 10 భారీ ( మేజర్ )
బ్రిడ్జిలు, 37 ( చిన్న (మైనర్ ) బ్రిడ్జిలు, 40 రోడ్ అండర్ బ్రిడ్జిలు
మరియు 07 రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లను కల్గి ఉన్నాయి.