సిగ్మా-9 సోలార్ పవర్ ప్రాజెక్టు పురస్కారోత్సవంలో వక్తలు
విజయవాడ: భవిష్యత్తులో సోలార్ పవర్ అత్యంత ప్రాధాన్యతను
సంతరించుకోబోతుందని ఏపిసీపీడీసీయల్ చీఫ్ జనరల్ మేనేజర్ వి.రవి
అన్నారు. సిగ్మా-9 సోలార్ పవర్ ప్రాజెక్టు పురస్కారోత్సవాన్ని
గవర్నరుపేటలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ
రంగాల్లో గుర్తింపు పొందిన పలువురు ప్రముఖులకు లైట్ పింక్ కాంకరర్ ఆఫ్
హార్ట్స్ పేరుతో పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య
అతిథిగా పాల్గొన్న ఏపిసీపీడీసీయల్ చీఫ్ జనరల్ మేనేజర్ వి,రవి
మాట్లాడుతూ, విద్యుత్తు ఉత్పత్తికి సహజ వనరుల కొరత ఏర్పడుతుందని
రానున్న కాలంలో సోలార్ ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. నూతన సాంకేతిక విధానంతో
సిగ్మా-9 సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్వాహకులు ముందుచూపుతో అందుబాటులోకి
తీసుకురావడం అభినందనీయం అన్నారు. సోలార్ పవర్‌పై ప్రజలందరూ అవగాహన
పెంచుకోవాలని సూచించారు. సిగ్మా-9 సోలార్ పవర్ ప్రాజెక్టు డైరెక్టర్
మిక్కిలి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సోలార్ పవర్ అవసరం ఎంతో
పెరిగిందని, భారీ, చిన్న పరిశ్రమలతో పాటు గృహ వినియోగం కూడా సోలార్‌పైనే
ఎక్కువగా నడుస్తుందన్నారు. ప్రస్తుతం సోలార్ రంగంలో సరికొత్త
సాంకేతికతతో సిగ్మా-9 పవర్ ప్రాజెక్టు ముందుకు సాగుతుందని తెలిపారు.
సిగ్మా-9 సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే అనేక పరిశ్రమలు,
విద్యాసంస్థలు, వ్యవసాయ రంగానికి సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నట్లు
చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్తు, ఉపాధ్యాయ, న్యాయ శాఖ, కళా రంగం,
పరిశోధనా రంగాలకు చెందిన వి.రవి, వై.బి.టి.సుందరి, బి.డేవిడ్
రత్నకుమార్, డాక్టర్ అపర్ణ ప్రసాద్, ఇ.మల్లిబాబులను ఘనంగా
సత్కరించి లైట్ పింక్ కాంకరర్ ఆఫ్ హార్ట్స్ పేరుతో పురస్కారాలు
అందజేశారు. ఈ సందర్భంగా అపర్ణ ప్రసాద్ శిష్య బృందం ప్రదర్శించిన
కూచిపూడి నృత్యాంశాలు ఆహూతులను కనువిందు చేశాయి. కార్యక్రమంలో సిగ్మా-9
డైరెక్టర్లు కాగిత బసవరావు, చక్రాల శ్రీనివాసరాజు, ఎస్.మాల్యాద్రి,
చిన్నపురెడ్డి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.