ఇకపై ఆ సమయంలో రాయితీలు పూర్తిగా కట్
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికులకు రాయితీలో కోత విధించారు.
స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్లకు 10 శాతం రాయితీ సమయాన్ని
కుదించారు. రద్దీ సమయాల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేశారు. రేపటి నుంచి
రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఎల్ అండ్ టీ
మెట్రో వెల్లడించింది.