శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన కొత్త చిత్రం భాగ్ సాలే, జూలై 7న భాగ్ సాలే
విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి
ప్రశంసించారు. “భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ
ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు
క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి
గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా
కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. కీరవాణి గారికి పేరు
తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. ఇకపైనా మంచి అవకాశాలతో
తమ ప్రతిభను చాటుకోవాలి అని కోరుకుంటున్నాను. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ
సినిమాను రూపొందించాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్
కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.