ఉజ్బెకిస్థాన్‌లో వైద్యవిద్య కోసం 1800-123-2931 టోల్‌ఫ్రీ నెంబర్‌ను
ప్రారంభించిన ఉజ్బెకిస్థాన్ వైద్య మంత్రిత్వ శాఖ
విజయవాడ : తాష్కెంట్ మెడికల్ అకాడమీ (టీఎంఏ)లో మెడిసిన్ చదవాలని
భావించే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉజ్బెకిస్థాన్ వైద్య
మంత్రిత్వశాఖ, టీఎంఏ ఉన్నత స్థాయి బృందం భారతదేశంలో పర్యటిస్తున్నాయి.
టీఎంఏ, ఇతర సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని తప్పుడు హామీ ఇచ్చి భారీ
మొత్తాలు వసూలు చేసి బిచాణా ఎత్తేసే మోసపూరిత ఏజెంట్ల నుంచి విద్యార్థులను
రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే సెమినార్లలో
సందేహాలను నివృత్తి చేయడం, మార్గదర్శకత్వం అందించడం, హైదరాబాద్‌లోని టీఎంఏ
దక్షిణాసియా ప్రతినిధి కార్యాలయం ద్వారా రూ.5 లక్షల వరకు స్కాలర్ షిప్‌లతో
స్పాట్ అడ్మిషన్లు అందించడం ఈ ప్రతినిధి బృందం లక్ష్యం. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య
మంత్రిత్వ శాఖలో భారత ప్రతినిధి డాక్టర్ దివ్య రాజ్ రెడ్డి మాట్లాడుతూ,
ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో
ఇండో-ఉజ్బెక్ ఆరోగ్య ఫోరం ఏర్పాటైన తర్వాత, 1800-123-2931 అనే టోల్ ఫ్రీ
హెల్ప్ లైన్, ఉజ్బెకిస్థాన్‌లోని టీఎంఎ, ఇతర వైద్యవిద్యా సంస్థలలో
వైద్యవిద్య కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ద్వారా కొత్త చొరవ తీసుకున్నట్లు
తెలిపారు. వీటిద్వారా విద్యార్థులు తమకు అందే సమాచార కచ్చితత్వాన్ని,
ప్రవేశాల విషయాన్ని తెలుసుకుని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.
ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రి ఇన్నయతోవ్ ఎ, మొదటి ఉప ఆరోగ్యమంత్రి, టీఎంఏ
రెక్టార్ భారతీయ విద్యార్థులు ఎన్ఎంసీ నిబంధనలతో భారతదేశంలో రిజిస్ట్రేషన్
పొందడానికి మంచి సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. భారతదేశం, ఉజ్బెకిస్థాన్
రాయబారులు మనీష్ ప్రభాత్, దిల్షోద్ అఖతొవ్ భారతీయ విద్యార్థుల విషయంలో మంచి
శ్రద్ధ తీసుకుంటున్నారు. అసిస్టెంట్ రెక్టార్ ఎస్ అక్రంజోన్ మాట్లాడుతూ టీఎంఏ
యూనివర్సిటీ వందేళ్ల నాటి ఆధునిక విశ్వవిద్యాలయం అని, అధునాతన వీఆర్ అండ్ ఏఆర్
సిమ్యులేషన్, ల్యాబ్‌లు, 2000 బోధన పడకలతో కూడిన ఆస్పత్రులు ఉన్నాయని,
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ బెస్ట్ వరల్డ్ ర్యాంకింగ్ తో ప్రపంచవ్యాప్తంగా
గుర్తింపు పొందిందని తెలిపారు. అమెరికాలోని ఓక్లహోమా యూనివర్సిటీ, జర్మనీలోని
హంబోల్ట్ విశ్వవిద్యాలయంతో టీఎంఏకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. వీటిద్వారా
విద్యార్థుల పీజీ అవకాశాలను మరింత పెంచడం సాధ్యమవుతుంది. ఇవే కాక ఇంకా
యూకేలోని వెస్ట్ మినిస్టర్ విశ్వ విద్యాలయం, అమెరికాలోని వెబ్ స్టర్, దక్షిణ
కొరియాలోని డేగు హానీ విశ్వ విద్యాలయాలతో పాటు భారతదేశంలో
రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజి, మైసూరులోని జేఎస్ఎస్తో మంచి
ఒప్పందాలను కలిగి ఉంది.
తమ వ్యూహాత్మక భాగస్వామి నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్
టెక్నాలజీ ద్వారా భారతీయ విద్యార్థులు భారత దేశంలో ఎంబిబిఎస్ కి సమానంగా ఒక
ఏడాది ఇంటర్నషిప్ తో కుడిని 6 సంవత్సరాల మెడిసిన్ కోర్సును ఆంగ్ల మాద్యమంలో
చేయడానికి అనుమతి ఉందని, ఉజ్బెకిస్థాన్ లో ప్రాక్టీస్ కూడా చేసుకోవొచ్చని,
విద్యా విభాగాధిపతి డాక్టర్ ఎఎఫ్ జుసనోవ్నా తెలిపారు. దీనివల్ల ఇక్కడ
చదివిన విద్యార్థులు ఎన్ఎంసీ నిబందనల ప్రకారం భారతదేశంలో నెక్స్ట్
పరీక్ష రాసి ప్రాక్టీసు చేసుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి . విజయబాబు నియో ఇన్స్టిట్యూట్
ని పరిచయం చేస్తూ టీఎంఏ యొక్క వ్యూహాత్మక భాగస్వామి గా నియో ఇన్స్టిట్యూట్
ద్వారా భారతీయ విద్యార్థులకు ప్రామాణిక వైద్య విద్యను అందిస్తున్నట్లు
తెలిపారు. వైద్య పాఠ్యపుస్తకాలు, భారతీయ, అంతర్జాతీయ అధ్యాపకులు, స్మార్ట్
టీచింగ్ ప్రోగ్రాంలు, తదుపరి పరీక్ష కోసం మాస్టర్ తరగతులు, భారతీయ ఆహారంతో
కూడిన హాస్టల్ సదుపాయాలతో పాటు అదనంగా స్కాలర్షిప్లను అందిస్తుందని
తెలిపారు. డా. జాసూర్ బేగ్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు మిగతా విద్యార్థుల
తో పోటీ పడి మంచిగా రానిస్తున్నారని 600 మంద విద్యార్థులు లో 100 మంది తెలుగు
విద్యార్థులు టి ఎం ఏ లో చదువుతున్నారన్నారు.
ఉజబేకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, టి ఎం ఏ యూనివర్సిటీ వారు పోలా విజయబాబు
ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హోదా లో సత్కరించారు.