న్యూఢిల్లీ : భారత్‌లో కొత్తతరం పర్యాటకానికి ‘గంగా విలాస్’ నాంది
పలుకుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన
నదీ పర్యటక నౌకను వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసిలో
మొదలైన ఈ గంగా విలాస్ ప్రయాణం 51రోజుల్లో 3200కి.మీ మేర కొనసాగనుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ ప్రయాణాన్ని
వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ భారత్‌లో కొత్తతరం పర్యాటకానికి ఇది నాంది
పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఇది కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.
దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని
తెలిపారు. ఈ సందర్భంగా విదేశీ పర్యాటకులకు ఆహ్వానం పలికిన మోడీ తద్వారా
భారత్ గొప్పతనాన్ని స్వయంగా ఆస్వాదించవచ్చని పిలుపునిచ్చారు.
భారత్‌లో తయారైన ఈ తొలి నౌక లో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు
మొదటి ప్రయాణాన్ని చేయనున్నారు. వారణాసి నుంచి మొదలై అసోంలోని దిబ్రూగఢ్ వరకు
వీరి ప్రయాణం సాగుతుంది. మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది.
రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 ప్రసిద్ధ
పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది. 18 సూట్లు ఉండే ఈ నౌకలో 36 మంది
పర్యాటకులు ప్రయాణించవచ్చు. మూడు సన్డెక్లు, జిమ్ సెంటర్‌తోపాటు స్పా వంటి
లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. 51 రోజుల పాటు 3200 కి.మీ దూరం సాగే ఈ ప్రయాణంలో
ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా
51 రోజుల ప్రయాణానికి ఒక్కొక్కరికి సుమారు రూ.20లక్షల ఖర్చు అవనున్నట్లు
క్రూజ్ నిర్వాహకులు వెల్లడించారు. భారత్, బంగ్లాదేశ్‌లలో సాగే ఈ యాత్రలో
వారణాసిలోని గంగా హారతి, విక్రమశిల యూనివర్శిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా
నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడొచ్చని
తెలిపారు.