రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో శివసేన పార్టీ కీలక
నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే పాల్గొన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని
నాందేడ్ జిల్లా హింగోలి సమీపంలో కలంనురిలో రాహుల్ గాంధీని కలుసుకుని ఆత్మీయ
ఆలింగనం చేసుకున్నారు థాకరే. కొద్ది దూరం రాహుల్ తో పాటు కలిసి నడిశారు. ఈ
క్రమంలో ఆయనతో థాకరే కొంత ముచ్చటించారు. అనంతరం మీడియాతో ఆదిత్య థాకరే
మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర రాజకీయాల కంటే ఎక్కువని, ఇది దేశం యొక్క ఆలోచనని
అన్నారు. వాస్తవానికి ఈ యాత్రలో సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ పాల్గొనాల్సి
ఉంది. అయితే ఆకస్మిక అనారోగ్యం కారణంగా.. పవార్ ఆసుపత్రిలో చేరారని, అందుకే
హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం స్పష్టం
చేశారు. ఈ యాత్రకు ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, సుప్రియా సూలే, జితేంద్ర
అహ్వాద్ శుక్రవారం హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ఈ
ర్యాలీలో ఆదిత్య ఠాక్రేతో పాటు రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్
దాన్వే, మాజీ శాసనసభ సభ్యుడు సచిన్ అహిర్ ఉన్నారు.