భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించినట్లు
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం ప్రకటించారు. “భారతదేశంతో మా
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పార్లమెంటు ద్వారా ఆమోదించబడింది” అని ఆయన ట్విట్టర్
వేదికగా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాల
మొత్తం శ్రేణిలో సహకారాన్ని కలిగి ఉంటుంది. వస్తు వాణిజ్యం, సేవల వాణిజ్యంతో
పాటు వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు (TBT), సానిటరీ, ఫైటోసానిటరీ (SPS)
చర్యలు వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య పరంగా సంబంధాలు
మెరుగుపడనున్నాయి. వివాదాల పరిష్కారం, సహజ వ్యక్తుల తరలింపు, టెలికాం,
కస్టమ్స్ విధానాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఇతర రంగాల్లోనూ సహకారం
ఉంటుంది. డైమండ్స్, ఆభరణాలు, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఆహారం,
వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్
వంటి భారతదేశానికి ఎగుమతి ఆసక్తి ఉన్న అన్ని కార్మిక-ఆధారిత రంగాలు ఇందులో
ఉన్నాయి.