రానున్న 25 ఏళ్లకు రోడ్‌మ్యాప్ సిద్ధం
ప్రధాని నరేంద్ర మోడీ
ఎంతటి సంక్లిష్ట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్
విశ్వసిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ పురోగతిలో ఫ్రాన్స్ సహజ
భాగస్వామి అని తెలిపారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తనకు చేసిన సత్కారం 140కోట్ల
మంది భారతీయులకు చెల్లుతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్
మేక్రాన్‌తో ద్వైపాక్షిక అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి మీడియాతో
మాట్లాడారు.
భారత్ పురోగతిలో ఫ్రాన్స్ సహజ భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఫ్రాన్స్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పి 25 సంవత్సరాలు
పూర్తయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. రానున్న 25 ఏళ్లకు రోడ్‌మ్యాప్ సిద్ధం
చేస్తున్నట్లు చెప్పారు. చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం,
అణుశక్తి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో సహకారం దిశగా మరింత
ముందుకు వెళ్తామని మోడీ పేర్కొన్నారు. భారత్‌లో జాతీయ మ్యూజియం ఏర్పాటుకు
ఫ్రాన్స్ భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందని నరేంద్ర మోడీ అన్నారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు
గౌరవ అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాస్టీల్ డే పరేడ్‌ను
ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి వీక్షించారు. ఈ వేడుకలను
పురస్కరించుకొని దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్
ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అవార్డుతో మోడీని ఫ్రాన్స్ సత్కరించింది.
బాస్టిల్ పరేడ్ అనంతరం ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ
ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్త్రృతంగా
చర్చించారు. అనంతరం మేక్రాన్‌తో కలిసి, మోడీ మీడియాతో మాట్లాడారు. ఫ్రాన్స్
ప్రభుత్వం తనకు చేసిన సత్కారం 140కోట్ల మంది భారతీయులకు చెల్లుతుందన్నారు.
భారత్‌లో అవలంబిస్తున్న యూపీఐ పేమెంట్ విధానాన్ని ఫ్రాన్స్‌లోనూ
తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు సమ్మతించినట్లు తెలిపారు. కొవిడ్, ఉక్రెయిన్
సంక్షోభాల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గుర్తు
చేసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన
అవసరం ఉందన్నారు.
ఫ్రాన్స్‌లోని భారతీయుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక వీసా
విధానాన్ని ప్రధాని స్వాగతించారు. భారతదేశంలో క్యాంపస్‌లను తెరవడానికి ఫ్రెంచ్
విశ్వవిద్యాలయాలను ఆయన ఆహ్వానించారు. ఈ వ్యూహాత్మక చర్యలు రెండు దేశాల మధ్య
విద్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఎంత
సంక్షిష్టమైన వివాదాలనైనా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవచ్చని
భారత్ పూర్తిగా విశ్వసిస్తోందని మోడీ ఈ సందర్భంగా అన్నారు. శాంతిస్థాపనకు
భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇండో- పసిఫిక్
ప్రాంతంలో సహకారానికి ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయని, సీమాంతర
ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 2030
నాటికి 30 వేలమంది ఫ్రెంచ్ విద్యార్థులను భారత్‌కు పంపాలనుకుంటున్నామని
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అన్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నత
విద్యనభ్యసించాలనుకునే భారతీయ యువకుల కోసం వీసా విధానాన్ని
సరళీకరించాలనుకుంటున్నామని చెప్పారు. పారిస్ నడిబొడ్డున జరిగిన బాస్టిల్ డే
పరేడ్‌లో పంజాబ్ రెజిమెంట్ పాల్గొనడం చూసి గర్వపడ్డానన్నానని మేక్రాన్
వ్యాఖ్యానించారు. ప్రపంచ సంక్షోభాలకు భారత్-ఫ్రాన్స్ కలిసి పరిష్కారాన్ని
కనుక్కొగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్
మేక్రాన్ ప్రధాని మోదీకి కొన్ని ప్రత్యేక కానుకలు బహూకరించారు. వీటిలో ప్రముఖ
ఫ్రెంచ్ రచనలు, 11వ శతాబ్దంనాటి చార్లెమాగ్నే చెస్ బోర్డ్ నమూనాతోపాటు
1916లో తీసిన ఫొటో కాపీలు ఉన్నాయి. 1913-1927 మధ్య ఫ్రెంచ్ రచయిత మార్సెల్
ప్రౌస్ట్ ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ పేరుతో చేసిన రచనలతోపాటు, 20వ
శతాబ్దంలో అతి ముఖ్యమైనవిగా పరిగణించే ఫ్రెంచ్ సాహిత్యానికి సంబంధించిన
పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోడీకి మేక్రాన్ బహూకరించారు.