వాషింగ్టన్ : రష్యా నుంచి క్రమేపీ దూరంగా జరిగి భారత్ తమకు చేరువయ్యేలా చూస్తామని అమెరికా ప్రకటించింది. ‘‘ఇంధనం, భద్రత పరంగా రష్యా ఒక విశ్వసనీయ వనరు కాదనే కఠోర వాస్తవాన్ని అనేక దేశాలు తెలుసుకుంటున్నాయి. రష్యా నుంచి క్రమేపీ దూరంగా జరిగి భారత్ తమకు చేరువయ్యేలా చూస్తామని అమెరికా ప్రకటించింది. ‘‘ఇంధనం, భద్రత పరంగా రష్యా ఒక విశ్వసనీయ వనరు కాదనే కఠోర వాస్తవాన్ని అనేక దేశాలు తెలుసుకుంటున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఆర్థిక, రక్షణ రంగాల్లో భారత్కు భాగస్వామిగా నిలిచే పరిస్థితిలో అమెరికా లేదు. అప్పుడు రష్యాతో ఆ దేశ బంధం బలపడింది. గత 25 ఏళ్లలో అది మారిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆర్థిక, భద్రత, సైనిక సహకారం సహా అన్ని రంగాల్లో భారత్తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా భావిస్తోందని తెలిపారు. రష్యా నుంచి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుండడంపై స్పందిస్తూ ఇంధన రంగాన్ని ఆంక్షల నుంచి మినహాయించాలనేది తమ ఉద్దేశమని అన్నారు. అందువల్ల అదేమీ ఆంక్షల ఉల్లంఘన కిందికి రాదన్నారు.