న్యూజిలాండ్ జట్టు టీమిండియాతో ఈనెలలో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను మిచెల్ సాంట్నర్కు అప్పగించారు. ఇప్పటికే భారత్
లో పర్యటించే న్యూజిలాండ్ వన్డే జట్టును ప్రకటించిన ఆ దేశ క్రికెట్ బోర్డు.. తాజాగా టీ20 జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ టీ20 జట్టుకు మిచెల్ సాంట్నర్ నాయకత్వం వహిస్తాడు. ఎడమచేతి వాటం స్వింగ్ బౌలర్ బెన్ లిస్టన్ తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాడు. జనవరి 18న హైదరాబాద్లో జరిగే మొదటి వన్డేతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 24న చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ తరువాత ఇండియా వర్సెస్ భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 18న హైదరాబాద్లో ప్రారంభమయ్యే మూడు-మ్యాచ్ల వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జనవరి 27న రాంచీలో న్యూజిలాండ్ మొదటి టీ20 ఆడనుంది.