న్యూఢిల్లీ : వీసాల భారతంలో ప్రజలు, ఇన్వెస్టర్లు, విస్తృత మార్కెట్టే ఆర్థిక
వ్యవస్థను కాపాడుతున్నాయని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ
సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది, దేశ ఆర్థిక పరిస్థితి ఆనందదాయక రీతిలో
ముందుకు సాగుతోందనే సమాచారం దేశం నలుమూలల నుంచీ చెపుతున్నారని చెప్పారు.
పారిశ్రామిక, వాణిజ్య ప్రగతి వేగం పుంజుకున్న క్రమంలో ఇండియాలో ఆర్థిక
అసమానతలు కూడా పెరుగుతున్న మాట నిజమే. అయితే మొత్తంమీద దేశంలో పేదరికం
తగ్గుతోందని ఆయన అభిప్రాయ పడ్డారు. సంపద సృష్టి ఇదివరికెన్నడూ లేనంత వేగంగా
పెరుగుతోందని, విశ్వవ్యాప్తంగా పలు దేశాల స్థితిగతులు పరిశీలించే ప్రపంచ
బ్యాంక్ ఈ విషయాలను తన నివేదికలో వెల్లడించిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం,
పలు ధనిక దేశాల్లో మాంద్యం పరిస్థితులు సహా బయట నుంచి అనేక సవాళ్లు
ఎదురౌతున్నాఏడు అతి పెద్ద వర్థమాన ఆర్థిక వ్యవస్థలు, బహుముఖీనంగా అవతరిస్తున్న
పెద్ద మార్కెట్లలో ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి సాధించే స్థితికి
చేరుకుందన్నారు.
భారతదేశం విశాలమైనది. విభిన్న పరిస్థితులకు నిలయం. కొవిడ్–19 మహమ్మారి
విజృంభించిన సమయంలో దేశంలో వ్యవసాయరంగంలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సంక్షోభ
కాలంలో సాగురంగంలో చక్కటి వృద్ధి కనిపించింది. దేశానికి వెన్నెముక వంటి ఈ
రంగంలో ప్రభుత్వం సకాలంలో సరైన పద్ధతిలో ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు, పెట్టిన
పెట్టుబడుల కారణంగా మెరుగైన ప్రగతి సాధ్యమైందన్నారు.,’’ అని భారత ఆర్థిక
వ్యవస్థ పోకడలను నిత్యం పరిశీలించే సీఎంఐఈ సంస్థ సీఈఓ మహేష్ వ్యాస్
అభిప్రాయపడ్డారు. ‘ ప్రభుత్వం నుంచి లభించే రక్షణతో కార్పొరేట్ రంగం మెరుగైన
ఫలితాలు సాధించింది. కాని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బదిన్నాయి.
ప్రభుత్వం సకాలంలో స్పందించి పెట్టిన నియంత్రణలు, తీసుకున్న ఇతర చర్యలు
ద్రవ్యోల్బణాన్ని అందుపు చేయగలిగాయి,’ అని వ్యాస్ వివరించారు. భారతదేశానికి
ఉన్న నిరంతర అదృష్టం ఏమంటే– బయటి ప్రపంచంలోని అననుకూల లేదా వ్యతిరేక ఆర్థిక
పరిణామాలను తట్టుకునే శక్తి స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు ఉండడం. మరో ప్రధాన
బలం–సకల వనరులు ఉన్న విశాల భారతంలో తయారయ్యే వస్తు, సేవలకు తగిన విస్తృత
మార్కెట్ ఇక్కడే ఉండడం. అంతేగాక, అంతర్జాతీయంగా సాగే వాణిజ్య పరిణామాల
ప్రభావం ఇండియాపై తక్కువ ఉండడం కూడా మరో సానుకూల అంశం,’ అని ప్రపంచ బ్యాంక్
ఇటీవలి తన నివేదికలో విశ్లేషించింది.