పెట్టుబడులు
వైద్య రంగంలో కీలకమైన సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశానికి హాజరైన సీఎం జగన్
న్యూఢిల్లీ : ప్రపంచస్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడాలంటే రవాణా వ్యయం
గణనీయంగా తగ్గాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం
వ్యక్తం చేశారు. భారత్లో లాజిస్టిక్ రంగం చేస్తున్న వ్యయం ఎక్కువగా ఉందని,
ప్రపంచ స్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకం అవుతోందని ఏపీ
సీఎం జగన్ అన్నారు. ఈ వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి
సమావేశానికి సీఎం హాజరయ్యారు. రాష్ట్రం సాధించిన ప్రగతి- అమలు చేస్తున్న
కార్యక్రమాలపై సమావేశంలో నివేదిక సమర్పించారు. అన్ని రాష్ట్రాలు జట్టుగా
పనిచేయాల్సిన అవసరముందన్నారు. ప్రపంచస్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడాలంటే
రవాణా వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం
చేశారు. దేశంలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం
చేస్తున్న వ్యయం ప్రశంసనీయమన్నారు. ఏపీ కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిపై దృష్టి
పెట్టిందని, ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను
నిర్మిస్తోందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని అభివృద్ధి
చేసినట్టు తెలిపారు. జీడీపీ పెరుగుదలలో సేవలు, తయారీ రంగాలే కీలకమని
వ్యాఖ్యానించారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా
రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6లక్షల మందికి ఉపాధి
కల్పిస్తామన్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారంపై దృష్టి పెట్టామన్నారు. వైద్య
రంగంలో కీలకమైన సంస్కరణలు తెచ్చామని సీఎం వెల్లడించారు. ఏపీలో విలేజ్
క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానాల్ని అనుసరిస్తున్నట్టు వివరించారు.