ఇటీవలి మహిళల టీ20 చాలెంజర్ ట్రోఫీలో సత్తా చాటిన మీడియం పేసర్ అంజలీ
శర్వాణికి టీమిండియాలో చోటు దక్కింది. భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు
టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో ఆంధ్రప్రదేశ్‌లోని
ఆదోనికి చెందిన కేశవరాజుగారి అంజలీ శర్వాణి ఎంపికైంది. ఈ 25 ఏళ్ల లెఫ్టామ్
పేసర్ రెల్వేస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. కాగా ఆంధ్రకు చెందిన
ఓపెనర్ సబ్బినేని మేఘన జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియాతో
సిరీస్ ఈనెల 9నుంచి ముంబైలో జరగనుంది. చాలెంజర్ ట్రోఫీలో ఇండియా ‘సి’
కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఆ టోర్నీలో గాయపడడంతో
జట్టుకు ఎంపిక చేయలేదు. మహారాష్ట్రకు చెందిన ఆల్‌రౌండర్ దేవిక వైద్యకు
నాలుగేళ్ల తర్వాత జట్టులో చోటు లభించింది. జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్
(కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా
(కీపర్), జెమీమా, దీప్తీ శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, రేణుకా
సింగ్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, దేవిక, మేఘనా సింగ్, రిచా ఘోష్
(కీపర్), హర్లీన్.